NEWSTELANGANA

‘సుప్రీం’ లో ఎల్ అండ్ టికి చుక్కెదురు

Share it with your family & friends

షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కేసులో ప్రతికూల తీర్పు

హైద‌రాబాద్ – సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎల్ అండ్ టి సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కె పీ సి ఎల్ చేపట్టిన శరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ టెండర్ల ప్ర‌క్రియను చేపట్టింది.

ఎం ఈ ఈ ఎల్ ఈ టెండర్ దక్కించుకుంది. ఈ టెండర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఎల్ అండ్ టి సంస్థ కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించింది . ఎం ఈ ఐ ఎల్ , కె పీ సి ఎల్ ను ప్రతివాదులుగా చేర్చింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎల్ అండ్ టి పిటిషన్ ను కొట్టి వేసింది.

దీనిపై ఆ సంస్థ సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఎం ఈ ఐ ఎల్, కె పీ సి ఎల్ ను ప్రతివాదులుగా చేర్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎల్ అండ్ టి పిటీషన్ ను కొట్టివేసింది.

సుప్రీంకోర్టు లో లార్సెన్ అండ్ టూబ్రోస్ (L&T)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది . ప్రతిష్టాత్మకమైన శరావతి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ కోసం టెండర్ ప్రక్రియను సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటీషన్ పై వాదనలు సుదీర్ఘంగా విన్న తర్వాత ఎస్ ఎల్ పీ ని ని కొట్టివేసింది, టెండర్ దాఖలుకు రాష్ట్రం తగినంత సమయం మంజూరు చేసిందని ఆ సంస్థ బిడ్‌ను సమర్పించలేక పోయిందని పేర్కొంది.

ఎలక్ట్రో-మెకానికల్ , హై డ్రో-మెకానికల్ పనులలో అనుభవం లేదని, ఎల్ అండ్ టి టెండర్లో పాల్గొనడానికి అర్హత లేదని తెలిపింది. ప్రస్తుతం కేపీసీఎల్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న శరావతి పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు టెండర్‌ను తక్కువ ధరకు కోట్ చేసి ఎంఈఐఎల్‌ దక్కించుకుంది.