తోక ముడిచిన సీఎం రేవంత్
ఎద్దేవా చేసిన మాజీ సీఎం కేసీఆర్
ఖమ్మం జిల్లా – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. చేతకాని వాళ్లు గద్దెను ఎక్కితే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. తాను చెప్పిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని , దమ్ముంటే రాజీనామా చేయాలని తన మేనల్లుడు హరీశ్ రావు సవాల్ విసిరారని, కానీ చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి తోక ముడిచాడని మండిపడ్డారు కేసీఆర్.
ఆరు గ్యారెంటీలతో గారడీ చేశారని, ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని, సీఎం రేవంత్ రెడ్డి మాటల వెనుక మోసాన్ని గ్రహించారని చెప్పారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ వైపు ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
నాలుగు నెలలుగా తెలంగాణ మీద మిడతల దండును తరిమే సత్తా ఒక్క బీఆర్ఎస్ దండుకే ఉందన్నారు కేసీఆర్. ఆరు నూరైనా జనం తిరగబడటం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డి తనపై కావాలని కక్ష పెట్టుకున్నాడని ఆయనకు అంత సీన్ లేదన్నారు కేసీఆర్.