సాల్ట్ షాన్ దార్ ఢిల్లీ బేజార్
మరోసారి కోల్ కతా చేతిలో ఓటమి
కోల్ కతా – పంజాబ్ చేతిలో దారుణమైన ఓటమి చవి చూసిన కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. విజయాలతో మంచి ఊపు మీదున్న రోహిత్ సేనకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రధానంగా కోల్ కతా ఆటగాడు సాల్ట్ కొట్టిన దెబ్బకు ఢిల్లీ విల విల లాడింది. మనోడు ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
సొంత గడ్డపై ఆశించిన గెలుపు అందుకున్నారు. వరుసగా రెండు విజయాలతో దుమ్ము రేపిన ఢిల్లీ కేపిటల్స్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది. ఆ జట్టును చిత్తు చేసింది. ప్రధానంగా ముందు బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీని తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా త్వరగా పని పూర్తి చేసింది. ప్రధానంగా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. 68 రన్స్ చేశాడు. ఇక కెప్టెన్ అయ్యర్ ఔరా అనిపించేలా ఆడాడు. తను 33 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2వ స్థానంలో నిలిచింది. ఇక రాజస్థాన్ రాయల్స్ టాప్ లో కొనసాగుతోంది.