NEWSANDHRA PRADESH

మోడీ చేతిలో జ‌గ‌న్ కీలుబొమ్మ‌

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రికి సీఎం ద‌త్త పుత్రుడు

అమరావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆమె ఏపీ న్యాయ యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఆమెతో పాటు మాజీ ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు కూడా ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న క‌న్న తండ్రిని మోసం చేశాడ‌ని, చివ‌ర‌కు చెల్లెళ్లను వ్య‌క్తిగ‌తంగా విమర్శించేలా త‌న పార్టీ వారిని ప్రోత్స‌హించార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ పేరుకే సీఎం అయినా మొత్తం కంట్రోల్ అంతా కేంద్రం చేతుల్లో ఉంద‌న్నారు.

గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా ఏపీకి ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు. కేవ‌లం సంక్షేమ ప‌థకాల పేరుతో అప్పులు చేయ‌డం వాటిని పంచ‌డం త‌ప్ప ఇంకేం చేశారంటూ మండిప‌డ్డారు.

మొత్తంగా పీఎంకు ఓ రిమోట్ కంట్రోల్ గా ఉన్నాడ‌ని, ద‌త్త పుత్రుడిగా మారాడ‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ ష‌ర్మిల‌. ఇక‌నైనా ఆయ‌న మారితే బెట‌ర్ అన్నారు. ఈ రాష్ట్రంలో ఎవ‌రికి ఓటు వేసినా అది బీజేపీకి వేసిన‌ట్టేన‌ని హెచ్చ‌రించారు.