NEWSANDHRA PRADESH

అభివృద్దిలో కుప్పం కంటే డోన్ టాప్

Share it with your family & friends

ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి

క‌ర్నూలు జిల్లా – ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నారా చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వర్గం కంటే తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న డోన్ శాస‌న స‌భా నియోజ‌క‌వ‌ర్గాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో అన్ని రంగాల‌లో అభివృద్ది చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు.

చంద్ర‌బాబు నాయుడుకు విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పితే అభివృద్ది గురించి అస్స‌లు మాట్లాడ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇటీవ‌ల కొత్త‌గా ఆవిష్క‌రించిన మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని చూశారా అని ప్ర‌శ్నించారు. బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేనంటూ ఎద్దేవా చేశారు.

గ్యాస్ సబ్సిడీ, మహాలక్ష్మి పథకాల పేరుతో 2014లో మహిళలను దారుణంగా మోసం చేశాడ‌ని , ఇప్పుడు మ‌రోసారి ద‌గా చేసేందుకు రెడీ అయ్యాడ‌ని ఆరోపించారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి. ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తారన్న సోయి లేకుండా ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇస్తే ఎలా అని నిప్పులు చెరిగారు.