ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత
అన్ని వర్గాలకు భారీగా లబ్ది
చిత్తూరు జిల్లా – తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి అన్నారు. జగన్ రెడ్డి సారథ్యంలో అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందని చెప్పారు.
మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో పర్యటించారు. వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న హామీలు, గుప్పిస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఈసారి ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోవడం ఖాయమన్నారు. మరోసారి జగన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు పర్యాటక శాఖ మంత్రి.
తాము 2019లో ఇచ్చిన 100 హామీలలో 99 హామీలను అమలు చేయడం జరిగిందని చెప్పారు . తమ గెలుపును కూటమి నేతలు అడ్డుకోలేరని అన్నారు ఆర్కే రోజా సెల్వమణి.