ప్రచారకర్తలుగా సామాన్యులు
ప్రకటించిన వైఎస్సార్సీపీ
అమరావతి – ఏపీలో వైసీపీ కీలక ప్రకటన చేసింది. భారత రాజకీయాలలో పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. 2024 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా సామాన్యులను ఎంపిక చేసింది. మొత్తం 12 మందిని ఎంపిక చేశారు పార్టీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
వైసీపీ స్టార్ ప్రచార కర్తలలో నలుగురు మహిళలు, ఇద్దరు రైతులు, ఒకరు ఆటో డ్రైవర్ , మరొకరు టైలర్ , నలుగురు మాజీ ప్రభుత్వ వాలంటీర్లు ఉన్నారు. ఈ మేరకు జాబితాను మంగళవారం విడుదల చేసింది పార్టీ .
ఇక స్టార్ క్యాంపెయినర్లుగా గంగు కళ్యాణి, షేక్ సందానీ, ఒరేకంటి జనార్దన్ రెడ్డి, దాజప్పగారి జనప రూపాని, చెల్లె పరంజ్యోతి, పందలేనిని శివ ప్రసాద్ ను ఎంపిక చేశారు. వీరితో పాటు కట్టా జగదీశ్ , కృష్ణం రామకృష్ణ, గొల్లపల్లి శ్రీను, సయ్యద్ అన్వర్ , అనంత లక్ష్మి, చల్లా ఈశ్వరిలను ప్రచార కర్తలుగా నియమించింది.