ఫేక్ అకౌంట్లపై ఐఏఎస్ టాపర్ ఫైర్
పోలీసులను ఆశ్రయించిన అనన్యా రెడ్డి
హైదరాబాద్ – ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఐఏఎస్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తనపై కొందరు ఫేక్ అకౌంట్లను ఏర్పాటు చేశారని వాపోయారు. అంతే కాకుండా తన పేరుతో డబ్బులు కూడా వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
సోషల్ మీడియా వేదికగా తన పేరుతో తప్పుడు అకౌంట్లను సృష్టించారని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని తాను ఆలస్యంగా గుర్తించడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా యూపీఎస్సీ నిర్వహించని పరీక్షల్లో దేశ వ్యాప్తంగా 3వ ర్యాంకు పొందింది అనన్యా రెడ్డి.
ఆమె స్వస్థలం అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో ఇన్ స్టా గ్రామ్ ,, ట్విట్టర్ , టెలిగ్రామ్ వంటి ప్లాట్ ఫారమ్ లలో ఫేక్ ఐడీలను క్రియేట్ చేశారని ఆరోపించారు.
కొన్ని ఛానెల్స్ అయితే తన పేరుతో మెంటార్ షిప్ ప్రోగ్రామ్ లు అందిస్తున్నాయని, డబ్బులు కూడా వసూలు చేస్తున్నాయని వాపోయారు అనన్యా రెడ్డి.