ఎన్నికల ప్రచారంలో తమిళి సై
హైదరాబాద్ లో అభ్యర్థులకు మద్దతుగా
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆమె గతంలో రాష్ట్రానికి గవర్నర్ గా సేవలు అందించారు. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని రీతిలో తను గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే రాజ్ భవన్ ను ఖాళీ చేసి వెళ్లి పోయారు.
అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ వెంటనే తమిళనాడులో ఎన్నికల బరిలో నిలిచారు. పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. డీఎంకే కు వ్యతిరేకంగా ఆమె తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు తమిళి సై సౌందర రాజన్.
తమిళనాడులో ఇటీవలే ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఆమె తో పాటు పార్టీ చీఫ్ అన్నామలై కుప్పు స్వామి సైతం ఇతర రాష్ట్రాలలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తమిళి సై సౌందర రాజన్ కూడా తెలంగాణ లో బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. ఆమె 10 రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.
ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన తమిళి సైని హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొంపెల్ల మాధవీలత కలుసుకున్నారు.