ఎట్టకేలకు శాంసన్ కు ఛాన్స్
టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు
ముంబై – అమెరికాతో పాటు వెస్టిండీస్ లో జూన్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠకు తెర దించింది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ ను దృష్టిలో ఉంచుకుని , ఆయా ఆటగాళ్ల పర్ ఫార్మెన్స్ ను పరిగణలోకి తీసుకున్నారు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో టీమిండియా స్క్వాడ్ కు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది.
ఇక గత కొంత కాలంగా ఆట పరంగా రాణిస్తున్నా ఎందుకనో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను పక్కన పెడుతూ వచ్చింది. దీనిపై తాజా, మాజీ ఆటగాళ్లు సైతం తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇచ్చింది .
ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు శాంసన్. దీంతో ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. ఇక జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్ కాగా హార్దిక్ పాండ్యా ఉప నాయకుడిగా ఉంటాడు. వీరితో పాటు యశస్వి జైశ్వాల్ , విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ , పంత్ , సంజూ శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, పటేల్ , కుల్దీప్ యాదవ్ , యుజ్వేంద్ర చాహల్ , అర్ష్ దీప్ సింగ్ , బుమ్రా, సిరాజ్ ఉన్నారు.
స్టాండ్ బై ఆటగాళ్లుగా శుభ్ మన్ గిల్ , రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ను ఎంపిక చేశారు.