NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ ను ఓడించ‌డం ఖాయం

Share it with your family & friends

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కామెంట్

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ కాపు నాయ‌కుడు, వైసీపీ సీనియ‌ర్ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ముందు నుంచి జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. పిఠాపురంలో ఓడించి పంప‌డం ఖాయ‌మ‌న్నారు. ఒక‌వేళ ఓడించ‌క పోతే తన పేరు మార్చుకుంటాన‌ని స‌వాల్ విసిరారు.

ఇంత కాలం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను న‌టుడిగానే చూశామ‌ని కానీ రాజ‌కీయాల‌లో కూడా అద్భుతంగా న‌టిస్తుండ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌న్నారు. ప్ర‌జ‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను న‌మ్మ‌డం లేద‌న్నారు. ఆయ‌న ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌ద‌న్నారు. ఇక ఏపీకి , నియోజ‌క‌వ‌ర్గానికి ఎలా జ‌వాబుదారీగా ఉంటాడ‌ని ప్ర‌శ్నించారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.

చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టి లాగే అబ‌ద్దాలు మాట్లాడుతూ, మోస‌పు హామీల‌తో ముందుకు వ‌స్తున్నాడ‌ని , ఆయ‌న‌కు కూడా ఈసారి త‌గిన రీతిలో బుద్ది చెప్పేందుకు జ‌నం సిద్దంగా ఉన్నార‌ని చెప్పారు. ఇక కూట‌మి ఈ దెబ్బ‌తో క్లోజ్ కావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశారు. ఇక‌నైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాలు వ‌దిలేసి సినిమాలు చూసుకుంటే మంచింద‌న్నారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.