NEWSTELANGANA

కేసీఆర్ ను కూట‌మిలోకి రానివ్వం

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఫైర్

హుజూరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంగ‌ళ‌వారం హుజూరాబాద్ లో జ‌రిగిన జ‌న జాత‌ర స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

ఆయ‌న‌కు అన్ని దారులు మూసుకు పోయాయ‌ని, ప్రస్తుతం దేశ రాజ‌కీయాల‌లో చక్రం తిప్పుతానంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లిక‌న కేసీఆర్ కు భ‌విష్య‌త్తు లేకుండా పోయింద‌న్నారు. ఆయ‌న‌ను ఎవ‌రూ కూడా న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. త‌న‌తో జ‌త క‌డితే ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు సీఎం.

ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మిలోకి కేసీఆర్ ను రానిచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు ఎనుముల రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద‌కు వ‌స్తే వెంట‌నే తుపాకీతో కాల్చి పారేస్తామంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఒక సీఎంగా జంతుల‌ను ర‌క్షించాల‌ని కోరాల్సింది పోయి ..కాకిని కాల్చేస్తామ‌న‌డం విడ్డూరంగా ఉంది. మొత్తంగా ఎన్నిక‌ల వేళ మాట‌ల తూటాలు పేలుతుండడం విశేషం.