ఖాళీ చేయకండి చదువుకోండి
త్వరలోనే జాబ్స్ భర్తీ చేస్తాం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ పై భగ్గుమన్నారు. ఉస్మానియా యూనివర్శిటీతో పాటు ఇతర యూనివర్శీటీలలో చదువుకుంటున్న విద్యార్థులు నిశ్చింతగా ఉండాలని సూచించారు. ఎవరి మాటలు వినవద్దని కోరారు. కొందరు తమ స్వప్రయోజనాల కోసం కావాలని విద్యార్థులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఎలాంటి భయ భ్రాంతులకు లోనుకాకుండా నిశ్చింతగా చదువు కోవాలని సూచించారు మల్లు భట్టి విక్రమార్క. ఎవరూ ఖాళీ చేయాల్సిన అవసరం లేదన్నారు . మీరు లేనిదే ప్రభుత్వం లేదన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగిందన్నారు.
మరికొన్నింటిని భర్తీ చేశామని చెప్పారు డిప్యూటీ సీఎం. ఉద్యోగాల వేటలో ఉండాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో గుర్తుకు తెచ్చు కోవాలన్నారు. నాయకుల ఊబిలో పడవద్దని కోరారు భట్టి విక్రమార్క.