తండ్రికి తగ్గ తనయుడు కాదు
తన కోసం ఛార్జ్ షీట్ లో పేరు
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడు కాదని మండిపడ్డారు. తనను తాను కాపాడు కునేందుకు కన్న తండ్రినైన వైఎస్సార్ పేరును ఛార్జ్ షీట్ లో నమోదు చేయించాడని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రజలు జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్నాయని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ లో లేక పోతే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు కోర్టుల్లో పిటిషన్లు వేయించారని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. సుధాకర్‌రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్‌ఆర్ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చిందని స్పష్టం చేశారు. సొంత కొడుకై కూడా తండ్రి పేరును చేర్పించడానికి కృషి చేశాడని , ఆయనకు మనసు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు.
ఇలా ఎవరైనా చేస్తారా? ఎంత దుర్మార్గమిది అని ఫైర్ అయ్యారు. కేసుల నుంచి బయట పడటానికి జగన్ చేసిన దుర్మార్గపు చర్య ఇది అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ కుట్రకు కారణం జగన్ అని ఆరోపించారు. తప్పు చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీదకు నెట్టడం దుర్మార్గమన్నారు. తండ్రి పేరు ఛార్జిషీట్‌లో చేర్పించిన దుర్మార్గం గురించి ఆంధ్రా ప్రజలు ఆలోచించాలన్నారు.