పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు
నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. పాసు పుస్తకాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. తాతలు, తండ్రులకు సంబంధించిన ఫోటోలు పాసు పుస్తకాలపై ఉండాలే తప్పా సీఎం ఫోటో ఎందుకు ఉండాలని నిలదీశారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి రెడ్డిని స్వయంగా వైసీపీ నేత నిలదీశాడని గుర్తు చేశారు టీడీపీ చీఫ్. రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
జగన్ పనై పోయిందని, ఇక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. తాము వచ్చాక వైసీపీ ఆధ్వర్యంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపడతామని హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు.
సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని మోసం చేసిన ఘనత సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జనం మార్పు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు టీడీపీ చీఫ్.