స్టోయినిస్ సూపర్ షో
లక్నో గెలుపులో కీలక పాత్ర
లక్నో – ఐపీఎల్ 2024లో ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్ పేలవమైన ప్రదర్శన చేస్తోంది. దీంతో ముంబై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరికోరి ముంబై ఆటగాడు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ జట్టు లోకి తీసుకోవడమే కాకుండా కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించినా సీన్ ఏమీ మారడం లేదు. విచిత్రమైన కెప్టెన్సీతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
రోహిత్ శర్మను తప్పించడంపై మండిపడుతున్నారు. మితి మీరిన ఆత్మ విశ్వాసంతో జట్టును ఓటమి పాలయ్యేలా చేస్తున్నాడంటూ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండానే రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. లక్నో వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.
19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇక లక్నో జట్టుకు చెందిన మార్కస్ స్టోయినిస్ అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 62 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. లక్నో ప్లే ఆఫ్స్ పై ఆశలు పెంచుకుంటే దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు వెయిట్ చేస్తోంది ముంబై ఇండియన్స్.