జన హితం ప్రజా గళం
చంద్రబాబు..పవన్ కళ్యాణ్
అమరావతి – టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆధ్వర్యంలో 2024 ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మేని ఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీలకు చెందిన చీఫ్ లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , బీజేపీ తరపున సీనియర్ నేత. ఈ సందర్బంగా జన హితమే లక్ష్యంగా, ప్రజా సమస్యలే పరిష్కార మార్గంగా దిశా నిర్దేశం చేసేలా తాము ప్రజా గళంతో మేని ఫెస్టోను తయారు చేయడం జరిగిందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు.
కూటమి నేతలకు ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా… అన్ని వర్గాలకు నిండైన సంక్షేమాన్ని, ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవితాన్ని, ప్రగతి పూర్వక భవిష్యత్తును అందించే హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
ఇది ప్రజలు కోరుకున్న ప్రజా మేనిఫెస్టో అని స్పష్టం ఏశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని నేను మాటిస్తున్నానని అన్నారు. కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీడీపీ చీఫ్.