ఏపీ ఎన్నికల్లో 2,841 మంది అభ్యర్థులు
ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
అమరావతి – ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మే 13న శాసన సభ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో పాటు తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగనుంది.
రాష్ట్రంలో మొత్తం 2,841 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని స్పష్టం చేశారు సీఈఓ. ఏప్రిల్ 18న తుది గడువు విధించింది ఎన్నికల సంఘం. ఏపీలో మొత్తం 175 శాసన సభ స్థానాలు ఉండగా 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
ఇక 25 ఎంపీ స్థానాలకు గాను 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు ముఖేష్ కుమార్ మీనా. 175 శాసన సభ స్థానాలకు గాను 2,387 మంది బరిలో నిలిచారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి ఎమ్మెల్యే సీటుకు 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు ముఖేష్ కుమార్ మీనా. ఇక అత్యల్పంగా చోడవరం నియోజకవర్గంలో కేవలం ఆరుగురు మాత్రమే బరిలో నిలిచారని వెల్లడించారు సీఈవో.