NEWSTELANGANA

జ‌నం చూపు కాంగ్రెస్ వైపు

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించ‌ని రీతిలో సీట్లు గెలుచుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల చూపంతా త‌మ వారిని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నార‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు.

వ‌చ్చే ఆగ‌స్టు 15 లోపు ఇచ్చిన మాట ప్ర‌కారం రైతులు తీసుకున్న రూ. 2 ల‌క్ష‌ల లోపు రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. 17 ఎంపీ సీట్ల‌కు గాను కాంగ్రెస్ పార్టీకి 14కు పైగానే వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు క‌సి మీద ఉన్నార‌ని, మ‌న ఎంపీల‌ను గెలిపించు కోవాల‌ని ప్ర‌య‌త్నం చేయాల‌ని పిలుపునిచ్చారు ఎనుముల రేవంత్ రెడ్డి.

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్క‌టేన‌ని ఆ రెండు పార్టీలు బ‌య‌ట‌కు విమ‌ర్శ‌లు చేసుకుంటూ లోప‌ట లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ స‌త్తా చాట‌డం త‌ప్ప‌ద‌న్నారు సీఎం.