సీఎం కోసం సీజేఐకి లేఖ రాస్తా
రాస్తానన్న పోసాని కృష్ణ మురళి
అమరావతి – రాష్ట్ర చలన చిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ , ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు జగన్ ను లేకుండా చేయాలని కుట్ర పన్నాయంటూ వాపోయారు. ఇప్పటికే రాళ్లతో దాడికి దిగారని, ప్రమాదవశాత్తు బతికి బయట పడ్డాడని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి అవసరం ఏపీకి చాలా ఉందన్నారు పోసాని కృష్ణ మురళి. ఇందులో భాగంగానే తాను వైఐసీపీ బాస్ ను రక్షించాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు లేఖ రాస్తానని స్పష్టం చేశారు.
త్వరలోనే లేఖ రాయడం జరుగుతుందని చెప్పారు. ఇందులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కాపాడాలని కోరుతానని తెలిపారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ వస్తున్నారని కానీ దీనిని టీడీపీ కూటమి నేతలు కావాలని అడ్డంకులు కల్పిస్తున్నారంటూ పేర్కొన్నారు. మొత్తంగా కృష్ణ మురళి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.