మా జోలికొస్తే ఖబడ్దార్ – సీఎం
ప్రధాని మోదీపై సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్లలో బుధవారం జరిగిన బహిరం సభలో నిప్పులు చెరిగారు. ప్రధానికి అంత సీన్ లేదన్నారు.
కేవలం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. చిల్లర మల్లర పాలిటిక్స్ కు ఇది వేదిక కాదన్నారు. తమను బెదిరించే ప్రయత్నం చేస్తే జనం మౌనంగా ఉండరని గుర్తు పెట్టు కోవాలని అన్నారు రేవంత్ రెడ్డి.
బీజేపీకి ఆనాడు నిజాం నవాబుకు, రజాకర్లకు పట్టిన గతి తప్పదన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు గుజరాత్ శక్తులకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు సీఎం. తమను భయపెట్టి , కేసులు పెట్టాలని చూస్తే బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదన్నారు రేవంత్ రెడ్డి.
రిజర్వేషన్లను రద్దు చేయడంలో భాగంగానే బీజేపీ నాటకాలు ఆడుతోందన్నారు. ఎలా ప్లాన్ చేసిందో తాను బట్ట బయలు చేస్తానని చెప్పారు సీఎం.