ఆ ఫేక్ వీడియోతో సంబంధం లేదు
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కు సంబంధించిన ఫేక్ వీడియోను తాను షేర్ చేసినట్లు నమోదు చేసిన కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన సీరియస్ గా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
ఆయన ఫేక్ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపించినట్లు తెలిపారు. ఏఐసీసీ ఆధ్వర్యంలోని తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను ఉపయోగించడం లేదని చెప్పారు.
తాను కేవలం రెండు ట్విట్టర్ ఖాతాలను మాత్రమే కలిగి ఉన్నానని వెల్లడించారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఆ రెండింటిలో ఒకటి తెలంగాణ సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) , రెండోది తన వ్యక్తిగత ఖాతా (ఎనుముల రేవంత్ రెడ్డి ) అనే పేరుతో ఉన్నవి మాత్రమేనని తెలిపారు.
మిగతా ఖాతాలతో తనకు ఎలాంటి అనుబంధం కానీ లేదా సంబంధం కానీ లేదని పేర్కొన్నారు తెలంగాణ సీఎం. ఇదిలా ఉండగా ఫేక్ వీడియో షేర్ చేశారన్న దానిపై ఢిల్లీ పోలీసులు సీఎంకు సమన్లు జారీ చేశారు.