చంద్రబాబుకు మతి చెడింది
ఏపీ సీఎం వైఎస్ జగన్
విజయనగరం జిల్లా – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఆయన మానసిక స్థితి బాగో లేదన్నారు జగన్ రెడ్డి. ప్రజలంతా ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బాబు మెంటల్ గా అత్యంత బలహీనంగా ఉందన్నారు. ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు సీఎం.
వెన్నుపోటు పొడవడం, మనుషులను చంపేయడం చంద్రబాబు నాయుడు అసలు రాజకీయం అని ఆరోపంచారు. దివంగత ఎన్టీ రామారావును, వంగవీటి మోహన రంగాను కుట్ర పూరితంగా చంపింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు జగన్ మోహన్ రెడ్డి.
ఐఏఎస్ ఆఫీసర్ రాఘవేంద్రరావును చంపింది ఎవరో చెప్పాలన్నారు. బాబును నమ్మే స్థితిలో లేరన్నారు. తాము గతంలో ఇచ్చిన 100 శాతం హామీలను అమలు చేయడం జరిగిందని చెప్పారు . ఇకనైనా బాబు తన తప్పులు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.