బీజేపీ జోష్ మోదీ ఖుష్
మూడోసారి పీఎంగా ఎన్నిక
న్యూఢిల్లీ – నరేంద్ర మోదీ ఫుల్ ఖుషీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ మరోసారి కొలువు తీరనుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇక మీడియా అయితే గంప గుత్తగా మోదీ జపం చేస్తున్నాయి. 24 గంటల పాటు ఆయనకు సంబంధించిన వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడంతో జనం కూడా బీజేపీ గెలుస్తుందని భావిస్తున్నారు.
ఇది పక్కన పెడితే జనాన్ని ప్రభావితం చేయడంలో మోదీ తర్వాతే ఎవరైనా. తను అనుకున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడంలో తనకు తనే సాటి అని ప్రూవ్ చేసుకున్నారు పీఎం. భారత దేశ చరిత్రలో మరో రికార్డు నెలకొల్ప బోతున్నారు మోదీ. అదేమిటంటే ఇప్పటి వరకు జవహర్ లాల్ నెహ్రూ పేరు మీద ఉండేది. ఇప్పుడు తను కూడా రికార్డు పుటల్లోకి ఎక్క బోతున్నారు ప్రధానమంత్రి.
ఆయన వరుసగా మూడోసారి పీఎంగా ఆశీనులు కానున్నారు. ఇదే విషయం తెలుసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. ఈసారి గనుక పవర్ లోకి వస్తే ప్రతిపక్షాలను నామ రూపాలు లేకుండా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ కూడా చేశారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మొత్తంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ భావిస్తోంది.