బన్నీ ‘పుష్ప పుష్ప’ సెన్సేషన్
విడుదలైన వెంటనే రికార్డ్
హైదరాబాద్ – డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మాస్ హీరో అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప -2 చిత్రానికి సంబంధించి మే 1న సాయంత్రం 5 గంటలకు మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప పుష్ప పేరుతో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను ఎప్పటి లాగే దమ్మున్న రచయిత చంద్రబోస్ రాశాడు.
బన్నీ లోని అసలైన నటుడిని మరోసారి తెర మీద ఎక్కించే ప్రయత్నం చేశాడు సుకుమార్. ఇక పుష్ప దుమ్ము రేపింది. విడుదలైన అన్ని చోట్లా రికార్డుల మోత మోగించింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగింది తొలి పార్ట్ మూవీ.
భారీ విజయం అందుకోవడంతో పుష్ప డైరెక్టర్ సుకుమార్ సంచలన ప్రకటన చేశారు. పుష్ప -2 తీస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని, వై . రవి శంకర్ దీనిని నిర్మించారు. ఈ సినిమాలో బన్నీతో పాటు రష్మిక, ధనుంజయ్ , రావు రమేష్ , సునీల్ , అనసూయ భరద్వాజ్ , అజయ్ ఘోష్ నటించారు. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చారు.
పుష్ప -2 మూవీ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు టాక్. మొత్తంగా పుష్ప \పుష్ప మూవీ మేనియా స్టార్ట్ అయ్యింది. ఇక పుష్ప పుష్ప పాటను నకాష్ అజీజ్ , దీపక్ బ్లూ పాడారు.