NEWSTELANGANA

‘గాడిద గుడ్డు’పై భ‌గ్గుమ‌న్న బండి

Share it with your family & friends

ఇదేనా కాంగ్రెస్ నీచ సంస్కృతి

క‌రీంన‌గ‌ర్ జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీ సిట్టింగ్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు పేరుతో బీజేపీని, మేనిఫెస్టోను ఉద్దేశించి చేసిన అవ‌మానాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా సీరియ‌స్ అయ్యారు. గాడిద గుడ్డు ఎవ‌రిదో చెప్పాల‌న్నారు.

60 ఏళ్లలో కాంగ్రెస్ నిర్మించిన హైవేలకు సమానంగా 10 ఏళ్లలోనే నిర్మిస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. గిరిజనుల ప్రగతికి సమ్మక్క సారక్క గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తే… అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు అయ్యింద‌న్నారు.

రైతుల ఎరువు కష్టాలు తీర్చేలా రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపిస్తే.. పన్నుల వాటా 32 శాతం నుంచి 41 శాతానికి పెంచి తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు ఇస్తే.. త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

రాష్ట్రానికి పథకాలు, అభివృద్ధి పనుల కోసం రూ.5 లక్షల కోట్లు ఇస్తే , తెలంగాణ ప్రగతికి దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణసాయం అందిస్తే అది నేరం ఎలా అవుతుంద‌న్నారు. రైల్వే అభిృద్ధికి రూ 32,823 కోట్లు ఖర్చు చేస్తే. గ్రామీణ పట్టణ మౌలిక సదుపాయాలకు రూ.34 వేల కోట్లకు పైగా ఇస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డుగా అనిపించిందంటూ ఎద్దేవా చేశారు.