నేనొస్తా చుక్కలు చూపిస్తా
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేం పార్టీ కూటమి పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు ఆ పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా చీరాలలో జరగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావడం పక్కా అని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కూటమికి కనీసం 170కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు.
ఇక సీఎంగా రెండో సంతకం మాత్రం జగన్ మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసే ఫైల్ పై ఉంటుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. జగన్ రెడ్డి, ఆయన పరివారం మాఫియా ముఠా నుంచి కాపాడే పూర్తి బాధ్యత తనదేనంటూ ప్రకటించారు.
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, ఇక కొన్ని రోజులు మాత్రమే ఓపిక పట్టాలని సూచించారు . జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు ఆయనను భరించే స్థితిలో లేరన్నారు టీడీపీ చీఫ్.
ఏపీని అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసి ఇప్పుడు అభివృద్ది చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు.