DEVOTIONAL

ఎస్వీ క‌ళాశాల‌లో ప్రవేశాల‌కు ఆహ్వానం

Share it with your family & friends

ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్న టీటీడీ

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ ) ఆధ్వ‌ర్యంలో ప‌లు కార్య‌క్రమాలే కాదు కోర్సులు కూడా నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఓ వైపు ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడుతూనే మ‌రో వైపు భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించేందుకు కోర్సుల‌ను నేర్పిస్తోంది.

ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది టీటీడీ.

కళాశాలలో జూన్‌ 17వ తేదీ వరకు దరఖాస్తులు పొందవచ్చని తెలిపింది. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్‌ 17వ తేదీ సాయంత్రం లోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేసింది.

4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సులో చేర దలచిన విద్యార్థులు కోర్సుల విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637, 9866997290 నంబరులో గానీ కార్యాలయ పని వేళల్లో సంప్రదించాల‌ని కోరింది.