కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం
48 గంటల పాటు క్యాంపెయిన్ కు స్టాప్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టకుండా నిషేధం విధించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మే 1 బుధవారం రాత్రి 8 గంటల నుండి రెండు రోజుల పాటు ఈ బ్యాన్ ఉంటుందని స్పష్టం చేసింది. అంటే దాదాపు 48 గంటల పాటు నిషేధం అమలులో ఉంటుందని ఈసీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా కేసీఆర్ పై నిషేధం విధించడానికి గల ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం వల్లే ఈ చర్య తీసుకోవడం జరిగిందని తెలిపింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీపై సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీని, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేస్తూ వస్తున్నారు. ఆయన గంటల కొద్దీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాను ఎలా అభివృద్ది చేశాననే దానిపై వివరిస్తున్నారు కేసీఆర్. ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై భగ్గుమన్నారు .