NEWSNATIONAL

మోదీ మోసం జ‌నానికి ద్రోహం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ – ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేప‌ట్టిన రోడ్ షోకు భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. ఆమెకు అడుగ‌డుగునా నీరాజనాలు ప‌లికారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు ప్రియాంక గాంధీ.

ఈ దేశంలో అత్య‌ధికంగా అబ‌ద్దాలు చెప్ప‌డంలో టాప్ లీడ‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే ఒకే ఒక్క పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంద‌ని , ఆయ‌న ఎవ‌రో కాదు మ‌న దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అంటూ ఎద్దేవా చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తాన‌ని చెప్పాడని, ప్ర‌తి ఒక్క‌రి ఖాతాలో రూ. 15 ల‌క్ష‌లు జ‌మ చేస్తాన‌ని న‌మ్మించాడ‌ని ఆరోపించారు.

తీరా ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక జ‌నం చెవుల్లో పూలు పెట్టాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు ప్రియాంక గాంధీ. కేవ‌లం కొద్ది మంది బిలియ‌నీర్ల‌కే వ‌త్తాసు ప‌లుకుతూ దేశంలోని వ‌న‌రుల‌ను అన్నింటిని దోచి పెడుతున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోదీకి గుణ‌పాఠం త‌ప్ప‌ద‌న్నారు.