రామ్ గోపాల్ వర్మ వైరల్
ఏకంగా శ్రీదేవితో ఫోటో
హైదరాబాద్ – వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఓ మేధావి. అంతకు మించిన విశ్లేషకుడు. సినిమా రంగంపై మంచి పట్టున్న దర్శకుడు. అంతే కాదు 24 కళల గురించి విడమరిచి చెప్పే డైరెక్టర్లలతో తను టాప్. తను అక్కినేని నాగార్జునతో తీసిన శివ మోస్ట్ సెన్సేషన్. మూస ధోరణితో ప్రయాణం సాగిస్తున్న వెండి తెరను ఒక్కసారిగా తన క్రియేటివిటీతో కుదిపేశాడు. అతడు ఓ బ్రాండ్. అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు. తనే ఓ ఫ్యాక్టరీ.
ఒక రకంగా చెప్పాలంటే తమకు ఎదురే లేదంటూ విర్ర వీగుతూ వచ్చిన ముంబై లోని బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆర్జీవీ జెండా పాతేశాడు. తను వందలాది మందిని తయారు చేశాడు. వారంతా ఇప్పుడు మోస్ట్ పాపులర్ నటీ నటులుగా చెలామణి అవుతున్నారు. అంతే కాదు టెక్నిషియన్స్ కూడా తను తయారు చేసిన వాడే. కంపెనీ, సత్య , సర్కార్ ..ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ ను షేక్ చేశాయి.
ఇక రాను రాను వర్మ రివ్యూలు, అభిప్రాయాలు చెప్పడంపై ఫోకస్ పెట్టారు. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో వివాదాలు, మరెన్నో కేసులు అయినా ఎక్కడా తలవంచని తత్వం రామ్ గోపాల్ వర్మది. ఆయన శిష్యులలో పూరీ జగన్నాథ్, కృష్ణ వంశీ, తేజ ఇలా చాలా మంది జాబితాలో ఉన్నారు.
తనకు శ్రీదేవి అంటే వల్లమాలిన అభిమానం. కానీ తను ఇప్పుడు లేదు. అయితే తాజాగా తను ఆమె పక్కన దిగుతూ ఉన్న ఫోటోను షేర్ చేశాడు ఆర్జీవి. ఇప్పుడు అది వైరల్ గా మారింది. ఎంతైనా వర్మనా మజాకా కదూ.