పోటెత్తిన ప్రజానీకాన్ని నిషేధిస్తారా
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
మహబూబాబాద్ – భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించడంపై తీవ్రంగా స్పందించారు. తనను నిషేధించ గలరని , కానీ తన కోసం ప్రాణాలు ఇచ్చే లక్షలాది మంది ప్రజల గొంతులను నిషేధించ గలరా అని ప్రశ్నించారు.
తాను కావాలని , వ్యక్తిగతంగా ఎవరినీ కించ పరిచేలా మాట్లాడ లేదన్నారు. కానీ కావాలని తనకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఎన్నికల సంఘం ద్వారా కుట్రకు దిగిందని సంచలన ఆరోపణలు చేశారు కేసీఆర్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
సిరిసిల్లలో తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనకంటే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన పరివారం అనుచిత వ్యాఖ్యలు చేశారని, మరి ఎన్నికల సంఘానికి ఆ విషయం ఎందుకు కనిపించ లేదని నిలదీశారు.
మొత్తంగా ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కేసీఆర్.