నిషేధం దారుణం కేటీఆర్ ఆగ్రహం
ఉద్యమ నేతపై కక్ష కట్టిన కాంగ్రెస్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తన తండ్రి, బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను టార్గెట్ చేయడంపై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారంపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇది పూర్తిగా వ్యక్తిగత కక్ష సాధింపు తప్ప మరోటి కాదని పేర్కొన్నారు కేటీఆర్. ప్రచారంపై ఉక్కు పాదం మోప గలరని, కానీ కోట్లాది ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్ రూపాన్ని ఎలా చెరిపి వేయగలరని, ఎలా నిషేధం విధించ గలరని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
రోజు రోజుకు కాంగ్రెస్ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తప్ప హామీలు అమలు చేయడంపై ఫోకస్ పెట్టడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండ గడుతున్నందుకే కావాలని తన తండ్రిని టార్గెట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై ఎంతగా నిషేధం విధించినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు కేటీఆర్.