అభివృద్దికి బాబు బ్రాండ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి , మాజీ సీఎం , పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ది తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏకైక పట్టుదల కలిగిన నాయకుడు తన తండ్రి అని పేర్కొన్నారు. ఏపీని అన్ని రంగాలలో ముందంజలో నిలిపేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.
చంద్రబాబు నాయుడు అంటేనే ఓ బ్రాండ్ అని పేర్కొన్నారు. కియా కారు కంపెనీని తీసుకు వచ్చింది తన తండ్రేనని పేర్కొన్నారు. హీరో బైకు, అపోలో టైర్ , ఎంఐ ఫోన్ తయారీలను ఇక్కడికి తీసుకు వచ్చిన ఘనత టీడీపీ చీఫ్ దేనని స్పష్టం చేశారు నారా లోకేష్.
ఇక జగన్ రెడ్డి బ్రాండ్ ఏమిటో తెలుసా..గంజాయిని సరఫార చేయడం, డ్రగ్స్ కు ఏపీని కేరాఫ్ గా మారడం, కోడి కత్తి, బాబాయిపై గొడ్డలి దాడి, నవ రత్నాల పేరుతో మోసం చేయడం అంటూ ఎద్దేవా చేశారు . ప్రజలు ఈ మోసాన్ని గ్రహించలని హెచ్చరించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
జగన్ రెడ్డి పనై పోయిందని, ఇక ఆయన మాటలను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.