NEWSANDHRA PRADESH

బాబు వ‌ల్ల‌నే తెలుగుకు ప్రాధాన్య‌త

Share it with your family & friends

కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి కామెంట్స్

మంగ‌ళ‌గిరి – టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు నారా లోకేష్ భార్య‌, హెరిటేజ్ సంస్థ‌ల మేనేజింగ్ డైరెక్ట‌ర్ నారా బ్రాహ్మ‌ణి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌న భర్త‌కు మ‌ద్దతుగా ఆమె కొన్ని రోజులుగా ఇక్క‌డే ఉంటున్నారు.

ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ గెలిపించాల‌ని కోరుతున్నారు. విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు నారా బ్రాహ్మ‌ణి. ఈ దేశంలో మ‌హిళ‌లలో ఉన్న శ‌క్తిని గుర్తించిన ఏకైక నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు.

ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాక పోయి ఉంటే మ‌హిళ‌లు ఇవాళ సంఘాలుగా ఏర్పాటు అయ్యే వారు కాద‌ని అన్నారు నారా బ్రాహ్మ‌ణి. అంతే కాదు ఈ దేశంలో ఉన్న‌త విద్య అవ‌కాశాలు అందించాల‌నే ల‌క్ష్యంతో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఏకైక నాయ‌కుడు ఒకే ఒక్క‌డు నారా చంద్ర‌బాబు నాయుడు అని స్ప‌ష్టం చేశారు .

ఆయ‌న దూర దృష్టి వ‌ల్ల‌నే ఇవాళ తెలంగాణ‌లోని హైద‌రాబాద్ ఐటీ ప‌రంగా, ఇంజ‌నీరింగ్, మెడిక‌ల్ రంగాల‌లో టాప్ లో కొన‌సాగుతోంద‌ని చెప్పారు నారా బ్రాహ్మ‌ణి. అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వారికి గౌర‌వ ప్ర‌ద‌మైన గుర్తింపు తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కూడా బాబుదేన‌న్నారు .