మా నాన్న అన్ స్టాపబుల్
కూతురు నారా బ్రాహ్మణి
అనంతపురం జిల్లా – నారా లోకేష్ భార్య, హెరిటేజ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ , ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తనయురాలు నారా బ్రాహ్మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తండ్రి హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా రోడ్ షో చేపట్టారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నారా బ్రాహ్మణి.
సీనీ రంగంలో, రాజకీయ రంగంలోనే కాదు సేవా రంగంలో కూడా తన తండ్రి నందమూరి బాలయ్య బాబు అన్ స్టాపబుల్ అని కొనియాడారు. ఆయన వృత్తిని దైవంగా భావిస్తారని చెప్పారు. అత్యంత క్రమశిక్షణ కలిగిన నటుడని పేర్కొన్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తనను చూసి నేను నేర్చుకున్నానని చెప్పారు నారా బ్రాహ్మణి.
ప్రత్యేకించి తన తాత గారు ఉన్నప్పటి నుంచీ హిందూపురం నియోజకవర్గంతో, ఈ ప్రాంతం ప్రజలతో విడదీయలేని బంధం ఉందన్నారు . ఆయన తమను మరిచి పోయినా ఈ గడ్డను మరిచి పోరన్నారు. అంతలా ఈ ప్రజలతో అనుబంధం పెంచుకున్నారని, ఇదంతా మీరందించిన ప్రేమాభిమానాలేనని తెలిపారు నారా బ్రాహ్మణి.