NEWSANDHRA PRADESH

రోజాకు ఏఎంకే పార్టీ మ‌ద్ద‌తు

Share it with your family & friends

ధ‌న్య‌వాదాలు తెలిపిన మంత్రి

చిత్తూరు జిల్లా – ఎన్నిక‌ల వేళ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణికి అన్ని రంగాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌త్య‌ర్థి కూట‌మి అభ్య‌ర్థి కంటే ప్ర‌చారంలో ముందంజ‌లో ఉన్నారు. వైసీపీ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇదిలా ఉండ‌గా గురువారం మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణికి అన్నా మ‌క్క‌ల్ క‌చ్చి పార్టీ (ఏఎంకే) సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆ పార్టీ చీఫ్ ఇవి క‌న్నాయ‌రం ఆధ్వర్యంలో మంత్రిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఆమెను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల‌లో అభివృద్ది చేశార‌ని , మ‌రోసారి ఆమె ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని, తిరిగి మంత్రిగా కొలువు తీరాల‌ని పార్టీ చీఫ్ ఇవి క‌న్నాయ‌రం కోరారు.

త‌న‌కు పార్టీ ప‌రంగా సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేసినందుకు ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి సంతోషం వ్య‌క్తం చేశారు. పార్టీ బాధ్యుల‌కు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేశారు. అంద‌రి ఆద‌రాభిమానాల‌తో తాను గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. సంక్షేమ ఫ‌లాలు ప్ర‌తి ఒక్క‌రికీ అందేలా చేయ‌డంలో తాను స‌క్సెస్ అయ్యాన‌ని చెప్పారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.