కాంగ్రెస్..బీజేపీకి బుద్ది చెప్పండి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు
నాగరకర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండలో పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అన్నింటిని మరిచి పోయిందన్నారు. ప్రస్తుతం కొత్త రాగం అందుకున్నాడని, ఏడికి పోతే ఆ దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నాడని, రుణ మాఫీ చేస్తానంటూ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
ఇక ప్రధాన మంత్రి మోదీ మరోసారి జనం చెవుల్లో పూలు పెట్టారని, ఇప్పటికే కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందని, దీనిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరు సిద్దం కావాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తమ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించడం దారుణమన్నారు. తమ నాయకుడి కంటే ఎక్కువగా మోదీ, రేవంత్ రెడ్డి మాట్లాడారని మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.