యూడీఎస్ సర్వేలో వైసీపీ హవా
120 నుంచి 130 స్థానాలు వస్తాయి
అమరావతి – ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మే 13న ఇటు ఏపీలో అటు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు తేదీలను కూడా ఖరారు చేశాయి. ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నం అయ్యాయి. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో బరిలో నిలిచాయి.
ఈ సందర్బంగా ముందస్తు సర్వేల ఫలితాలు ప్రకటిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ పవర్ లోకి వస్తుందనే దానిపై. తాజాగా గురువారం యూనివర్శల్ డిజిటల్ సొల్యూషన్స్ లేటెస్ట్ సర్వే ప్రకటించింది. ఇందులో సంచలన విషయం వెల్లడించింది. మరోసారి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నాడని ప్రకటించింది.
వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం ఆ పార్టీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని వెల్లడించింది యూడీఎస్ . ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అతి కష్టం మీద 45 నుంచి 55 సీట్ల దాకా రానున్నాయని పేర్కొంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి.