బీజేపీ నైజం వేధించడం
సీఎం సిద్దరామయ్య కామెంట్
కర్ణాటక – సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జేడీఎస్ ఎంపీ, ఎమ్మెల్యే తండ్రీ కొడుకులు ఇద్దరూ లైంగిక వేధింపులకు సంబంధించి కేసు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
దీనిపై తమ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసిందన్నారు. అయినా లేని పోని విధంగా తమపై బురద చల్లేందుకు అమిత్ షా ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఎవరు ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేయాలనేది వారు నిర్ణయించు కుంటారని, పార్టీలు చెప్పినంత మాత్రాన ఓట్లు వేస్తారని అనుకోవడం భ్రమ తప్ప మరోటి కాదన్నారు .
తండ్రీ కొడుకులకు మద్దతుగా ప్రధానమంత్రి మోదీ ప్రచారం చేయడం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఒలింపిక్స్ లో పాల్గొని భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిన మహిళా అథ్లెట్ల పట్ల మీరు అనుసరించిన పద్దతి, వేధింపుల పర్వం దేశం మొత్తం చూసిందన్నారు. ఇక సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో ప్రధాన నిందితులను విడుదల చేయించింది మీరు కాదా అని నిలదీశారు.