SPORTS

స‌త్తా చాటిన తెలుగోడు

Share it with your family & friends

నితీష్ కుమార్ రెడ్డి సూప‌ర్

హైద‌రాబాద్ – ఐపీఎల్ 2024లో భాగంగా హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు మ‌రోసారి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. టాస్ గెలిచిన పాట్ క‌మిన్స్ ఎలాంటి ఆల‌స్యం చేయ‌కుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

రాజస్థాన్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు హైద‌రాబాద్ బ్యాట‌ర్లు. ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి 37 ర‌న్స్ కే క‌ట్ట‌డి చేశారు. అభిషేక్ 12 ర‌న్స్ కే ఔట్ కాగా అన్ మోల్ ప్రీత్ 5 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. ఓ వైపు వికెట్లు కోల్పోయినా ట్రావిస్ హెడ్ దూకుడు పెంచాడు. 58 ర‌న్స్ తో కీల‌క పాత్ర పోషించాడు.
క్లాసెన్ 40 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

ఇక తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సూప‌ర్ ఇన్నింగ్స్ తో దుమ్ము రేపాడు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 76 విలువైన ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ ఒక్క ప‌రుగు తేడాతో ఓట‌మి పాలైంది. ప‌రాగ్ 77 ర‌న్స్ చేస్తే జైస్వాల్ 67 ప‌రుగులు చేశారు. కానీ ఊహించ‌ని రీతిలో షాక్ త‌గిలింది.