NEWSTELANGANA

గెలిపిస్తే ప్ర‌జా వాణి వినిపిస్తా

Share it with your family & friends

బీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆర్ఎస్పీ

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – త‌నను గెలిపిస్తే పాల‌మూరు ప్ర‌జ‌ల గొంతును పార్ల‌మెంట్ లో వినిపిస్తాన‌ని అన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క‌ల్వ‌కుర్తి శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్బంగా ఆమ‌న్ గ‌ల్ లో పార్టీల‌కు అతీతంగా ఏర్పాటు చేసిన బంజారా గ‌ర్జ‌న స‌భ‌కు వేలాదిగా బంజారాలు త‌ర‌లి వ‌చ్చారు. లంబాడాలు ఎక్కువ‌గా ఈ ప్రాంతంలో నివ‌సిస్తున్నారు. వారి ఆశీర్వాదాలు త‌న‌కు కోవాల‌ని కోరారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

త‌న‌ను గెలిపిస్తే గిరిజ‌నుల‌కు అండ‌గా, ర‌క్ష‌ణ‌గా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఎల్ల‌వేళ‌లా మీకు అందుబాటులో ఉంటాన‌ని, సేవ‌కుడిగా స‌హాయం చేస్తాన‌ని చెప్పారు బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి. నిండు మ‌న‌సుతో ఆశీర్వ‌దించాల‌ని , త‌నను పార్ల‌మెంట్ కు పంపించాల‌ని కోరారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

తాను ఒక్క‌డిని ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రంలోని గిరిజ‌నులంతా పార్ల‌మెంట్ కు వెళ్లిన‌ట్లేన‌ని పేర్కొన్నారు.