బీజేపీకీ అంత సీన్ లేదు – సునీతా
సీఎం భార్య కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్
గుజరాత్ – ఢి77ల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ లోని భరూచ్ , భావ్ నగర్ లలో ఆప్ ఆధ్వర్యంలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా సునీతా కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దేశంలో ప్రజాస్యామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి తప్పు చేయని తన భర్త సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అన్యాయంగా ఇరికించారని, జైలుపాలు చేశారని ఆరోపించారు.
కావాలని కేసులో ఇరికించారని, కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపిన విచారణలో ఒక్క పైసా కూడా దొరక లేదని అన్నారు సునీతా కేజ్రీవాల్. ఈసారి జరగబోయే ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్దంగా భావించాలని పిలుపునిచ్చారు.
ఏదో ఒక రోజు మోదీ నియంతృత్వం కూలి పోక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యయుత దేశంలో రాచరికపు పోకడకు తావు లేదని స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ప్రధాన మంత్రికి నైతికంగా పాలించే హక్కు లేదన్నారు.