బీజేపీకి 400 సీట్లు ఖాయం
బండి సంజయ్ కుమార్
కరీంనగర్ జిల్లా – సార్వత్రిక ఎన్నికల్లో భారత కూటమికి షాక్ తప్పదని అన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పటేల్. ఎన్నికల ప్రచారంలో భాంగా కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా బండి వెంట ఉన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సిట్టింగ్ ఎంపీ. దేశంలో మోడీ మేనియా నడుస్తోందన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కనీసం తమ పార్టీకి, అనుబంధ పార్టీలకు కలిపి 400 సీట్లకు పైగానే వస్తాయని జోష్యం చెప్పారు.
ప్రతిపక్షాలు ఈ దెబ్బకు క్లోజ్ చేసుకోవాల్సిందేనంటూ పేర్కొన్నారు. ఆరు నూరైనా తాను విజయం సాధించడం పక్కా అని, తన గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్. 143 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో బీజేపీ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఇండియా కూటమి నేతలు చెప్పే మాటలు నమ్మ వద్దని కోరారు సిట్టింగ్ ఎంపీ. ఇకనైనా మార్పు రావాలన్నారు.