NEWSTELANGANA

సీఎం నిర్ణ‌యం ఆర్ఎస్పీ ఆగ్ర‌హం

Share it with your family & friends

ఎందుక‌ని జిల్లాల ర‌ద్దుపై నిర్ణ‌యం

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నాయ‌కుడు, నాగ‌ర్ క‌ర్నూల్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాల‌నా ప‌రంగా ఫెయిల్ అయ్యార‌ని, త‌ను ఏం చేస్తున్నాడో త‌న‌కే తెలియ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

గ‌త ప్ర‌భుత్వం పాల‌నా ప‌రంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. దీని వ‌ల్ల సేవ‌లు త్వ‌రిత‌గ‌తిన అందుతున్నాయ‌ని, ఇదే స‌మ‌యంలో కొత్త ఉద్యోగాలు వ‌చ్చేందుకు వీలు ఏర్ప‌డింద‌న్నారు.

కానీ రేవంత్ రెడ్డి వ‌చ్చాక జిల్లాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేశార‌ని, జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ ను ఏర్పాటు చేశారంటూ ఆరోపించారు. ఇప్పుడున్న జిల్లాల‌తో ఏం స‌మ‌స్య వ‌చ్చిందో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ.

అంటే అర్థం నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు రాకుండా చేయాల‌నా లేక ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌కుండా అధికారుల‌ను దూరంగా ఉంచే ప్ర‌య‌త్నం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు .