జగన్ కక్ష ఉద్యోగులకు శిక్ష
ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కనీసం మాట్లాడేందుకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వక పోవడం దారుణమన్నారు ఏపీ పీసీసీ చీఫ్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
గతంలో వైఎస్సార్ హయాంలో ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకున్నారని, కానీ జగన్ రెడ్డి తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చాక వారి గురించి పట్టించు కోవడం మానేశాడని ఆరోపించారు . వైసీపీ సర్కార్ కావాలని వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన చెందారు.
రాష్ట్ర అభివృద్దిలో, సంక్షేమ పథకాల అమలులో కీలకమైన పాత్ర పోషించేది ఉద్యోగులు మాత్రమేనని ఆ విషయం జగన్ రెడ్డి తెలుసుకుంటే మంచిదని సూచించారు. పేరుకు తనకు సోదరుడు అయినా ప్రభుత్వ పరంగా రాజీ పడే ప్రసకక్తి లేదని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇకనైనా మేల్కొంటే మంచిదని జగన్ కు హితవు పలికారు.