రాహుల్ చల్లంగ బతుకు
ఎంపీగా నామినేషన్ దాఖలు
రాయబరేలి – ఇవాళ అత్యంత ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికైంది రాయబరేలి. సార్వత్రిక ఎన్నికల సందర్బంగా రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఆయన కేరళ లోని వాయనాడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
తన తల్లి సోనియా గాంధీ ప్రస్తుతం సీపీపీ చైర్ పర్సన్ గా ఉన్నారు. రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనారోగ్యం కారణంగా తను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు. ఈ నిర్ణయం తాను ఆలోచించి తీసుకున్నట్లు చెప్పారు సోనియా గాంధీ. తమ కుటుంబానికి రాయబరేలి ప్రాంతానికి విడదీయ లేని బంధం ఉందని పేర్కొన్నారు.
సోనియా గాంధీ కుటుంబం మొత్తం రాహుల్ నామినేషన్ సందర్బంగా రాయబరేలికి విచ్చేశారు. వారితో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నారు.
నామినేషన్ వేసిన అనంతరం పూజలు చేశారు రాహుల్ గాంధీ. ఆయనను పూజారులు ఆశీర్వదించారు. చల్లంగా బతకాలని దీవించారు.