రిజర్వేషన్ల రద్దు అబద్దం
ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చేసిన కామెంట్స్ పై స్పందించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఇదింతా పూర్తిగా అబద్దమన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద షెడ్యూల్డ్ కులాల సమూహంగా ఉందన్నారు. ఇదంతా దుష్ప్రచారం తప్పితే మరోటి కాదన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత 10 ఏళ్లలో బీజేపీ ఎలాంటి రిజర్వేషన్లను తొలగించ లేదని స్పష్టం చేశారు మందకృష్ణ మాదిగ.
ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, వాటి జోలికి వెళ్ల లేదని పేర్కొన్నారు. అంతే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. అర్హులైన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం ఇచ్చారని తెలిపారు.
భారత దేశం ఎంతో మంది ప్రధానులను చూసిందని కానీ మోదీ లాంటి ప్రధానిని చూడలేదన్నారు మందకృష్ణ మాదిగ.