SPORTS

చేతులెత్తేసిన ముంబై

Share it with your family & friends

కోల్ క‌తా గ్రాండ్ విక్ట‌రీ

ముంబై – ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ దుమ్ము రేపింది. ముంబైపై గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ప్లే ఆఫ్స్ కోసం ఆశ‌లు పెట్టుకున్న ఆ జ‌ట్టుకు తీవ్ర నిరాశే మిగిలింది. ముంబై జ‌ట్టు యాజ‌మాన్యం ఏరికోరి భారీ ధ‌ర‌కు హార్దిక్ పాండ్యాను తీసుకు వ‌చ్చింది. ఆపై కెప్టెన్సీ అప్ప‌గించింది. అయినా ఆ జ‌ట్టులో ఎలాంటి మార్పు క‌నిపించ లేదు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను 170 ర‌న్స్ కే క‌ట్ట‌డి చేసినా ఆ త‌ర్వాత అతి త‌క్కువ టార్గెట్ ను ఛేదించ లేక చేతులెత్తేసింది. కేకేఆర్ బౌల‌ర్లు అద్బుతంగా రాణించారు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో చుక్క‌లు చూపించారు ముంబై ఆట‌గాళ్లకు.

దీంతో కేవ‌లం 145 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. 24 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. ముంబై జ‌ట్టులో ఒక్క సూర్య కుమార్ యాద‌వ్ మాత్ర‌మే రాణించాడు. 56 ర‌న్స్ చేశాడు. మిగ‌తా వాళ్లంతా పెవిలియ‌న్ దారి ప‌ట్టారు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన కోల్ క‌తా సైతం చెమ‌టోడ్చింది. అయ్య‌ర్ 70 ర‌న్స్ చేస్తే మ‌నీష్ పాండే 42 ప‌రుగుల‌తో రాణించాడు.