భారత రాజ్యాంగం మారదు
స్పష్టం చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయన జాతీయ మీడియా ఛానల్ తో ముచ్చటించారు. ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రధానంగా నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. మిగతా పార్టీలను ఆయన అంతగా పట్టించు కోలేదు. కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఏకి పారేశారు. ఈ దేశంలో మతం పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలను కట్ట బెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ ఉన్నంత కాలంలో రిజర్వేషన్లు కొనసాగుతాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు ప్రధానమంత్రి. భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని దానిని మార్చే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
అంబేద్కర్ ఆశయాలను , ఆకాంక్షలను బీజేపీ అమలు చేస్తుందన్నారు. తాను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదన్నారు.